*శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మవారికి పుట్టింటి సారే సమర్పించిన పాత కుమ్మరి వీధి వాసులు* ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా దేశం లో అన్ని రామ మందిరాల్లో రాముల వారి కళ్యాణం వైభవోపేతంగా జరుపుకుంటున్నారు,అందులో భాగంగా శ్రీరామనవమి శుభ సందర్భంగా చీపురుపల్లి మండలంలో ఉన్న కస్పావీధి రామ మందిరం ప్రాంగణంలోశ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నులు పండుగగా నిర్వహించడం జరిగింది.పాత కుమ్మరి వీధి వాసులు అందరూ కలిసి ప్రతి ఇంటి నుండి పిండి వంటలు, పళ్ళు కాయలు, పట్టువస్త్రంలు, తాళిబొట్టు, పసుపు కుంకుమ, గాజులు, మెట్టెలు, తలంబ్రాలు, సారి సామానులతో కాలనీ పెద్దలు, యువత మహిళాలు, పిల్లలు ఊరేగింపుగా మేళ తాళాలతో సీతమ్మవారికి పుట్టింటి తరుపున సారెను కస్పావీధిలో కొలువైన కోదండరామస్వామి ఆలయములో ప్రధాన అర్చకులకు సమర్పించారు.కాలనీవాసుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిధులు గా పాల్గొన్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార విభాగ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, చీపురుపల్లి జడ్పిటిసి సభ్యులు వలిరెడ్డి శిరీష సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతమ్మ సారేను కాలనీ మహిళలు తలపై మోసుకుని మేళతాళాలతో ఊరేగింపు గా పాత కుమ్మరి వీధి, సెగిడివీధి, దేవాంగుల వీధి, కస్పావీధి మీదుగా రామ మందిరానికి చేరుకొని రాముల వారి కళ్యాణంలో సారే సమర్పించారు అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సీతారాముల కల్యాణం ను వీక్షించడం జరిగింది.ఈ సందర్బంగా ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన,జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, జడ్పీటీసీ శిరీష దంపతులు లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనది, తర తరాలకు ఆదర్శనీయమైనది. సీతారాముల ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని, ఆ దివ్యమూర్తులను ప్రార్థిస్తూప్రజలందరికీ “శ్రీరామ నవమి శుభాకాంక్షలు” తెలిపారుఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న వారిలో విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, జడ్పిటిసి సభ్యులు వలి రెడ్డి శిరీష, ప్రభాత్ కుమార్ , మీసాల శ్రీనివాసరావు, నారాయణశెట్టి సోమేశ్, అశోక్, ఊలపల్లి బసన్న, సోపేటి జగదీశ్వరరావు, దయంత్రి సతీష్, సోపేటి కనకరాజు, కేబుల్ నాగు, కాలనీ పెద్దలు, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ ఆత్మీయ వీడ్కోలు సభ