సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నవీధి ప్రాంతంలో శనివారం పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో పోలీసులు ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తుల ఇళ్లు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా 15 మోటార్ సైకిళ్లను తనిఖీ చేసి, వాటి రికార్డులు మరియు యజమానుల వివరాలను ధృవీకరించారు. ఆపరేషన్‌లో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు, నిషేధిత వస్తువులు లేదా అక్రమ కార్యకలాపాలు గుర్తించబడలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రాంతంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజల భద్రత కోసమే ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నామని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి