సాలూరు పట్టణ పరిధిలో ఈ రోజు సాలూరు టౌన్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం మరియు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే విషయంపై అవగాహన కల్పించారు. డ్రైవర్‌తో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఓవర్‌లోడింగ్ చేయడం వలన జరిగే ప్రమాదాల గురించి వివరించి, ఆటో రిక్షాలు మరియు ఇతర వాహనాలలో అనుమతించిన సంఖ్యకన్నా ఎక్కువ మందిని ఎక్కించరాదని హెచ్చరించారు. పట్టణంలోని ముఖ్య కూడళ్ల వద్ద వాహన తనిఖీలు నిర్వహించి, హెల్మెట్ ధరించని వారు, ట్రిపుల్ రైడింగ్ చేసిన వారు, ఓవర్‌లోడింగ్ చేసిన వారు మరియు ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటార్ వెహికిల్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశామని. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగిస్తామని తెలియజేశారు. అలాగే మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు. మహిళలు మరియు విద్యార్థినులు రాత్రి వేళల్లో ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రయాణించరాదని, తమ ప్రయాణ వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయాలని సూచించారు. ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో 100/112 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించి సురక్షితమైన సాలూరు నిర్మాణంలో భాగస్వాములు కావాలని పెలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు మరియు టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు Spread the love టపా నావిగేషన్ పశువుల అక్రమ తరలింపుపై కేసు నమోదు