బంగారమ్మపేటలో ఘనంగా శ్రీశ్రీశ్రీ కుండలపోలమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట మహోత్సవం.

ఈరోజు సాలూరు పట్టణంలోని 25వ వార్డు బంగారమ్మపేటలో నిర్వహించిన *శ్రీశ్రీశ్రీ కుండలపోలమ్మ తల్లి* ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు.ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిమయ వాతావరణాన్ని సృష్టించాయి.

కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ఆశీర్వాదములు అందజేసి,అమ్మవారి కృప ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు.వార్డు ప్రజలు

రాజన్నదొర ని సత్కరించారు.స్థానిక ప్రజలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You missed