రిపోర్టర్…. PTR Naidu, chipurupalli
* ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహించిన ప్లాస్టిక్ నిర్మూలన అవగాహన ర్యాలీ.
* ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాడకాన్ని విస్మరించాలి, అధికారుల జరిమానాలకు భయపడి కాదు: శ్రీ కిమిడి కళావెంకటరావు పిలుపు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గాన్ని వందశాతం ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడమే మన అందరి లక్ష్యం కావాలని మాజీ మంత్రివర్యులు, చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు

నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా, ఈ వారం “ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్” అనే ప్రత్యేక థీమ్‌తో చీపురుపల్లి హెడ్ క్వార్టర్స్‌లో భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అధికారులు ఫైన్లు వేస్తారనే భయంతో కాకుండా, ప్లాస్టిక్ వల్ల భవిష్యత్తు తరాలకు జరిగే తీవ్ర నష్టాన్ని గుర్తించి ప్రజలు స్వచ్ఛందంగా మారాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. నిత్యజీవితంలో ఎక్కడా కూడా ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను వాడరాదని, వాటి స్థానంలో పర్యావరణానికి మేలు చేసే పేపర్ మరియు క్లాత్ బ్యాగులను మాత్రమే ఉపయోగించాలని కోరారు.

ప్లాస్టిక్ రహిత లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పటికే నియోజకవర్గంలో అనేక చర్యలు చేపట్టామని, రాబోయే రోజుల్లో సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు. చీపురుపల్లిని వందశాతం ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మార్చే ఈ పవిత్ర ఆశయంలో ప్రతి ఒక్క పౌరుడు, వ్యాపారస్తులు భాగస్వాములు కావాలని శ్రీ కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి