ప్రధాని నరేంద్ర మోడీ గారు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇంధనం పొదుపు చేస్తూ నడిచి ర్యాలీ నిర్వహించిన మంత్రి సంధ్యారాణి సాలూరు మున్సిపల్ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు స్వచ్ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు.ప్రజల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించే దిశ గా రోడ్డు ప్రక్కన ఉన్న చిరు వ్యాపారులతో మాట్లాడి ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని మంత్రి సూచించారు.ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.వ్యాపారులు గుడ్డ సంచులు, పర్యావరణహిత వస్తువులు ఉపయోగించాలని సూచించిన మంత్రి సంధ్య రాణి స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.పర్యావరణ పరిరక్షణ కోసం చిన్న చిన్న మార్పులతోనే గొప్ప ఫలితాలు సాధ్యమని మంత్రి అన్నారు. Spread the love టపా నావిగేషన్ పేస్ యాప్ లను వెంటనే రద్దు చేయాలి చీపురుపల్లిని 100 శాతం ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మారుస్తాం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు