పిల్లల దత్తత చట్టబద్ధంగా ఉండాలి

పిల్లల దత్తత చట్టబద్ధంగా ఉండాలి.మంత్రి సంధ్యారాణి తెలిపారు.
దత్తత తీసుకున్న పిల్లలను అతి భద్రంగా చూసుకోవాలని
పిల్లలను అమ్మినా, కార్మికులుగా మార్చినా కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు.
మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగింది
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం చట్టబద్ధం కాని దత్తత, పిల్లల అమ్మకాలను నివారించడం మరియు చట్టబద్ధమైన దత్తతపై అవగాహన కల్పించి, దత్తతను ప్రోత్సహించడమని
మన రాష్ట్రంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 27 శిశు గృహాలు ఏర్పాటు చేయబడాయని. ఈ శిశు గృహాలు అనాథలు, వదిలివేయబడిన, మరియు అప్పగించబడిన 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రక్షణ మరియు సంరక్షణను అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని
ప్రస్తుతం ఉన్న 27 శిశు గృహాలలో మొత్తం 108 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారని. గడచిన కాలంలో 473 మంది పిల్లలు స్వదేశీ దత్తతకు, 114 మంది పిల్లలు విదేశీ దత్తతకు ఇవ్వబడ్డారని తెలిపారు.

*అమలులో ఉన్న దత్తత విధానాలు:*
– *స్వదేశీ దత్తత*
– *విదేశీ దత్తత*
– *బంధువుల నుండి దత్తత* 
-*ఫోస్టర్ కేర్ & ఫోస్టర్ అడాప్షన్* 

విదేశాలకు తీసుకువెళ్లి పిల్లలను కార్మికులుగా మార్చిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *