సునీత రెడ్డి విజయనగరం విజయనగరం, జూన్ 19: ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో, Galaxy Clinical Research సంస్థ సహకారంతో “గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ (Good Clinical Practice – GCP)” అంశంపై ఒకరోజు వర్క్‌షాప్‌ను శుక్రవారం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య అధ్యాపకులు, పీజీ విద్యార్థులు, క్లినికల్ పరిశోధనలతో సంబంధం ఉన్న వైద్య నిపుణులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్, అనస్థీషియా విభాగాధిపతి డా. వి. వి. మాధవి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఎ. పద్మజ, ఈఎన్టీ విభాగాధిపతి డా. ఎల్. శ్రీనివాసరావు, మెడిసిన్ విభాగాధిపతి డా. ఎల్. లోకనాథ్, పాథాలజీ విభాగాధిపతి డా. జి. సుదర్శిని పాల్లెన్న పాల్గొన్నారు. ఫార్మకాలజీ విభాగాధిపతి డా. డి. అన్నపూర్ణ వర్క్‌షాప్ లక్ష్యాలను వివరిస్తూ, క్లినికల్ పరిశోధనల్లో నైతిక ప్రమాణాలు, గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ మార్గదర్శకాలు, పరిశోధనల నిర్వహణలో పాటించాల్సిన విధివిధానాలపై అవగాహన పెంపొందించడమే కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా నిపుణులు క్లినికల్ పరిశోధనల నైతికత, పరిశోధన రూపకల్పన, పరిశోధనలో పాల్గొనే వ్యక్తుల హక్కులు, డేటా నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, నాణ్యత నియంత్రణ తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు. వర్క్‌షాప్‌లో డా. పి. జె. శ్రీనివాస్, డా. ఎల్. శివకుమార్ సింగ్, డా. సి.ఎస్. శాంతి లక్ష్మి, డా. ఎన్. సురేష్ బాబు, డా. సుబ్బారావు తదితర నిపుణులు క్లినికల్ ట్రయల్స్‌లో పాటించాల్సిన ఉత్తమ పద్ధతులు, నైతిక ప్రమాణాలు, నియంత్రణ మార్గదర్శకాలపై సాంకేతిక అంశాలను వివరించారు. క్లినికల్ పరిశోధనల్లో నాణ్యత, పారదర్శకత, భద్రతను పెంపొందించేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని వక్తలు పేర్కొన్నారు. వర్క్‌షాప్‌లో వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, వైద్యులు, పీజీ విద్యార్థులు, పరిశోధకులు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. Spread the love టపా నావిగేషన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా దేశవ్యాప్తంగా రూ.2,400 కోట్ల PM-VBRY ప్రోత్సాహకాల డిబిటి ద్వారా లబ్దిదారుల ఖాతాలకు జమ కోడి రామూర్తి నాయుడు జీవిత చరిత్ర ను హిందీ భాషలోకి ” కలియుగ్ కా భీమ్ ”పేరుతో ఆవిష్కరణ