విజయలక్ష్మి విజయనగరం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మల్ల యోధుడు కోడి రామూర్తి నాయుడు జీవిత చరిత్ర ను హిందీ భాషలోకి ” కలియుగ్ కా భీమ్ ”పేరుతో ఆవిష్కరణ కార్యక్రమంస్థానిక యూ టి ఎఫ్ భవన్, విజయవాడ లో నిర్వహించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిసీ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పోతుల బాల కోటయ్య పాల్గొన్నారు. ఆదర్శప్రాయుడు కోడి రామమూర్తి నాయుడు అని కొనియాడారు. అనంతరం పుస్తక రచయిత శ్రీనివాస్ మాస్టారు ను ఘనంగా సత్కరించారు. హిందీ సేవా సదన్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం విజయవాడ బీసెంట్ రోడ్డు లో గల యుటిఎఫ్ భవన్ లో జరిగిన రాష్ట్రస్థాయి హిందీ సమావేశంలో హిందీ మంచ్ విజయనగరం జిల్లాశాఖ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు కోడి రామమూర్తి జీవిత చరిత్రపై హిందీలో ” కలియుగ్ కా భీమ్” అనే పేరుతో రాసిన పుస్తకాన్ని పెద్దలు ఆవిష్కరించారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య, ఏపీ సోషల్ ఆడిట్ రాష్ట్ర డైరెక్టర్ జి. శ్రీకాంత్, అమరావతి ఎన్నారై సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ సిహెచ్. రాజశేఖర్ తదితరులు ఆవిష్కరించి సభ్యులకు పంపిణీ చేశారు. హిందీ మంచ్ వ్యవస్థాపకులు, కేంద్ర ఆర్థిక శాఖ హిందీ సలహాదారు కోనే శ్రీధర్ పుస్తకాన్ని సమీక్షించారు. హిందీ సేవా సదన్ వ్యవస్థాపకులు ఎస్. గైబువల్లి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత ఏలూరి శ్రీనివాస్ ను అతిథులు శాలువ కప్పి, జ్ఞాపిక, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏ పి సోషల్ ఆడిట్ స్టేట్ డైరెక్టర్ జి. శ్రీకాంత్, హై కోర్టు న్యాయ వాది జె వి ఆర్ నరసింహా రెడ్డి, రాజశేఖర్, శృతి కాంత్ భారతి, గిరిధర్ రావు హిందీ మంచ్ ప్రతినిధులు ఎస్ గిరిధర్ రావు ఎస్. గిరిధర్ రావు, రొంపివలస రామారావు, టి. కామేశ్వరరావు, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ ప్రభుత్వ వైద్య కళాశాల విజియన్గరంలో గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ (GCP) వర్క్‌షాప్ తర్వాతి టపా