విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి



రాయితీపై విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన సంక్షేమ, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి

ఈ రోజు  రైతుల సుస్థిర వ్యవసాయాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిర్వహించబడిన “రాయితీపై విత్తన పంపిణీ కార్యక్రమం”లో గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా  రైతులకు అధిక దిగుబడి కలిగే నాణ్యమైన విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ధరపై అందజేస్తోంది.


రాష్ట్రంలో మొదటిగ ఇద్దనవలస గ్రామం,మెంటాడ మండలం, విజయనగరం జిల్లాలో రాయితీపై విత్తన పంపిణీ కార్యక్రమం చేశామాన్ని మంత్రి తెలిపారు.

“రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. ముఖ్యంగా గిరిజన రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు వ్యవసాయ వనరుల సరఫరాలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వారికి సమయానికి నాణ్యమైన విత్తనాలు అందజేయడం వల్ల పంటల ఉత్పాదకత పెరగడం తో పాటు వారి ఆదాయాలు కూడా మెరుగవుతాయి,” అని తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి