సాలూరు కూటమిలో రాజకీయ కలకలం!

సాలూరు కూటమిలో రాజకీయ కలకలం!

మంత్రి సంధ్యారాణి పై జనసేన శ్రేణు ల అసంతృప్తి!

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ రాజకీయాల్లో మరోసారి కూటమి రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి.
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పై జనసేన పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూటమి రాష్ట్ర నాయకత్వానికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
సాలూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించారంటూ జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో కూటమి తరఫున జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేయగా, స్వతంత్ర అభ్యర్థికి కొంతమంది టీడీపీ నాయకులు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు.
ముఖ్యంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఆమె అనుచరుల వ్యవహార శైలిపై జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి హర్ష వర్ధన్ భార్య ఐన గుళ్ళ మంజీరా ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలపడం, ఆమెకు మద్దతుగా ప్రచారం చేయడం, జనసేన అభ్యర్థులు పోటీ చేసిన స్థానాల్లో రెబల్ అభ్యర్థులకు ప్రోత్సాహం అందించాలని ఆరోపించారు.
అంతేకాకుండా జనసేన అభ్యర్థుల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా వ్యవహరించారని, కూటమి ధర్మాన్ని పాటించలేదని ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై సమగ్ర విచారణ జరిపించాలి అని, ఈ వ్యవహారంపై జనసేన రాష్ట్ర నాయకత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి అని, పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని,భవిష్యత్తులో కూటమి పార్టీల మధ్య సమన్వయం దెబ్బతినకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ కూటమి అధిష్టానానికి లేఖ రాశామని నాయకులు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి