విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ డెంకాడ మండలం చింతలవలస పంచాయతీ చింతలవలస పంచాయితీలో చింతల వలస 2 లో సోమవారం కాలువ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టిడిపి నాయకురాలు మరియు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మరియు వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ చీకటి సుహాసిని చింతల వలస రోడ్డుపై టిడిపి కండువా ధరించి పార్టీ జెండా పట్టుకొని ధర్నా చేశారు. దీంతో విజయనగరం నుండి ధర్మ పురం రహదారిపై వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చింతలవలస 2 లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఎదురుగా ఉన్న కాలవను నిర్మించకపోవడంతో సుమారుగా 200 కుటుంబాలకు చెందిన 400 మంది ప్రజల ఇబ్బందులు పడుతున్నారు. సంవత్సరం క్రితం ఫిర్యాదులు చేసిన అధికారులు హామీ ఇచ్చి అమలు కాలేదని ఆవేదన ఆమె వ్యక్తం చేశారు. మురుగనీరు నిలిచిపోవడం తొ దుర్వాసన ఈగలు దోమలు వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని కాలు నిర్మాణం చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. Spread the love టపా నావిగేషన్ ప్రశాంతయుత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా మెగా పల్లె నిద్ర