సునీత రెడ్డి విజయనగరం

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

విజయనగరం మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీగా ఆర్.నీలయ్య జూన్ 12న బాధ్యతలు చేపట్టారు. అనంతరం, జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారిని జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేయగా, జిల్లా ఎస్పీ గారు డీఎస్పీ గారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్ గారు మహిళా పోలీసు స్టేషనుకు వచ్చే బాధితులు, ఫిర్యాది దారులతో మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యలను సహృదయంతో విని, వాటిని పరిష్కరించేందుకు చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళలు, విద్యార్థినులకు మహిళల భద్రత, రక్షణ చట్టాలపట్ల పట్ల అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. మహిళల భద్రతకు రూపొందించిన శక్తి ఎస్.ఓ.ఎస్. మొబైల్ యాప్ పట్ల విస్తృత ప్రచారం కల్పించాలని, ఎక్కువ మంది మహిళలు గుమిగూడి ఉండే స్కూల్స్, కళాశాలలు, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్ ల వద్ద మహిళా భద్రత పట్ల అవగాహన కల్పించాలని, ఆపద సమయంలో శక్తి యాప్ వినియోగించి, రక్షణ ఎలా పొందవచ్చునో ప్రజలకు వివరించడం పట్ల దృష్టి పెట్టాలని డీఎస్పీ ఆర్.నీలయ్య ను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ఆదేశించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి