గజపతినగరం,

స్థానికుల ఫిర్యాదు మేరకు సిమెంట్ రోడ్ లో రోడ్డు పక్కన ఉన్న పాత భవనం నుండి విపరీతంగా పెరిగిన చెట్టు కొమ్మలను జనసేన పార్టీ నాయకుడు **తాళ్లపూడి సౌమిత్రి త్రివేది** ఆధ్వర్యంలో సురక్షితంగా నరికివేసి, సమస్యను పరిష్కరించారు.

గత కొంతకాలంగా ఈ చెట్టు కొమ్మలు రోడ్డుపై ఉన్న ప్రధాన విద్యుత్ తీగలను (పవర్ లైన్స్) పూర్తిగా కప్పేయడంతో ఏ క్షణంలోనైనా షార్ట్ సర్క్యూట్ జరిగి పెద్ద అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

స్థానికుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, ఎలక్ట్రికల్ ADE గారికి మరియు లైన్ మ్యాన్ కి సమస్య తెలియచేయడం జరిగింది. విద్యుత్ తీగలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, అడ్డుగా ఉన్న భారీ కొమ్మలను పూర్తిగా ట్రిమ్ చేయించారు. అనంతరం నరికిన కొమ్మలను రోడ్డుపై వాహనాలకు ఇబ్బంది లేకుండా ఒక పక్కకు చేర్చారు.

ఈ సమస్య పరిష్కరించిన **ADE** గారికి మరియు లైన్ మ్యాన్ **నవీన్** కి కృతజ్ఞతలు తేలపడం జరిగింది

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి