ఏపీలో జర్నలిస్టులకు అండగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్
జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనకు నిరంతర పోరాటం
నవంబర్ 7, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండగా నిలుస్తోందని ఏపీ రాష్ట్ర సలహాదారుల సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్ ఎస్.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు.
ఈ సందర్భంగా జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటనారాయణ మాట్లాడుతూ.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ 2015 సంవత్సరం నుంచి తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 2017లో అప్పటి ప్రభుత్వ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి అసోసియేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు.
అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అందించడంతో పాటు ఇళ్ల స్థలాల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని వెంకటనారాయణ వెల్లడించారు.
అలాగే అసోసియేషన్ నూతన కమిటీ వివరాలను నవంబర్ 24న విజయవాడలో ప్రకటించనున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా అసోసియేషన్ ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.
