కురుకూటి సర్పంచ్ అభ్యర్థిగా కొర్ర సన్యాసిరావుకు సీపీఐ మద్దతు

కురుకూటి సర్పంచ్ అభ్యర్థిగా కొర్ర సన్యాసిరావుకు సీపీఐ మద్దతు

– సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బలగ రాధానాయుడు

సాలూరు, నవంబర్ 20:

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కురుకూటి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో సీపీఐ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కొర్ర సన్యాసిరావును నిలబెట్టినట్లు సీపీఐ సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బలగ రాధానాయుడు వెల్లడించారు. సన్యాసిరావు గెలుపునకు గ్రామస్తులంతా ఐక్యంగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాధానాయుడు ఆధ్వర్యంలో కురుకూటి గ్రామంలో గ్రామ పెద్దలు, మహిళలతో బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీపీఐ పార్టీ తరఫున కొర్ర సన్యాసిరావును సర్పంచ్ అభ్యర్థిగా బలపరచడం జరిగిందని, గ్రామ ప్రజలందరూ ఐక్యంగా ఉండి ఆయన విజయానికి సహకరించాలని కోరారు.

గతంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భూ పోరాటాల్లో సన్యాసిరావు చురుకుగా పాల్గొన్నారని, గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేశారని రాధానాయుడు తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన, వాటి పరిష్కారం పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి కావడంతో ఆయనను సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేసి పార్టీ కండువా కప్పి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కురుకూటి పంచాయతీ గ్రామ పెద్దలు, మహిళలు, మాజీ సర్పంచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి