పాచిపెంట మండలంలో తండ్రి–కూతుళ్ల ఘన విజయం

పాచిపెంట మండలంలో తండ్రి–కూతుళ్ల ఘన విజయం!

ఎంపీటీసీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె విజయకేతనం.. గ్రామాల్లో హర్షాతిరేకాలు

పాచిపెంట, 9NEWS:

పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట మండల ఎంపీటీసీ స్థానాల ఎన్నికల్లో తండ్రి, కుమార్తె ఘన విజయం సాధించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రజల మద్దతుతో ఇద్దరూ విజయం సాధించడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

ఎన్నికల్లో ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవకు అంకితమవుతామని వారు తెలిపారు. విజయానంతరం అభిమానులు, కార్యకర్తలు పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

పాచిపెంట మండలంలో తండ్రి–కూతుళ్లు ఒకేసారి ఎంపీటీసీలుగా విజయం సాధించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


9NEWS | ప్రజల గొంతుక.. నిరంతరం మీ ముందుకు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి