స్థానిక ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో కూటమి ఘన విజయం.. వైసీపీ ఆరోపణలు నిరాధారం

*తేదీ: 21 నవంబర్ 2026*
*విజయనగరం*

విజయనగరం జిల్లా అశోక్ బంగ్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు *శ్రీ కిమిడి నాగార్జున గారి* అధ్యక్షతన నిర్వహించిన పత్రికా సమావేశంలో గౌరవ తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ *శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు* మాట్లాడుతూ జిల్లాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు.

విజయనగరం జిల్లాలో మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలన్నింటినీ కూటమి కైవసం చేసుకుందని, గౌరవ ముఖ్యమంత్రి *శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారి* నాయకత్వంలో ఈ విజయం సాధించామని తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షులు *శ్రీ కిమిడి నాగార్జున గారి* నాయకత్వంలో అన్ని స్థానాల్లో విజయాన్ని అందుకోవడం పార్టీ శ్రేణుల సమష్టి కృషికి నిదర్శనమని అన్నారు.

స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఒక్క కేసు నమోదైందా అని వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచారనడానికి ఎన్నికల ఫలితాలే స్పష్టమైన నిదర్శనమని, *2029లోనూ కూటమి విజయమే పునరావృతమవుతుందని* ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని *బొత్స సత్యనారాయణ* చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఖండించారు. పూసపాటిరేగ మండలంలో టీడీపీకి 13 మంది ఎంపీటీసీలు, వైసీపీకి 8 మంది ఎంపీటీసీలు ఉండగా, 8 మంది ఎంపీటీసీలతో వైస్ ఎంపీపీ పదవి ఎలా కోరుతారని ప్రశ్నించారు. ఎన్నికలకు దూరంగా ఉండి, ఇప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.

బీసీలను టీడీపీ అణచివేస్తోందన్న వైసీపీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంటూ, *బీసీల అభ్యున్నతికి స్వర్గీయ ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని, బీసీలకు వెన్నుదన్నుగా నిలిచిన పార్టీ తెలుగుదేశం* అని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన పార్టీ టీడీపీనేనని, జనరల్ రిజర్వేషన్ ఉన్నప్పటికీ బీసీ మహిళకు మేయర్ పదవి కల్పించిన ఘనత కూడా టీడీపీదేనని తెలిపారు. వైసీపీ హయాంలో బీసీలకు ఎందుకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందు ఆరోపణలు చేస్తే సమాధానం చెబుతామని, ఎన్నికల అనంతరం నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వైసీపీకి న్యాయవ్యవస్థపై నమ్మకం లేదని, ఒక అబద్ధాన్ని పదిసార్లు చెబితే నిజమవుతుందని భావిస్తూ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, *ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే జిల్లాలో వైసీపీ రాజకీయ మనుగడ కష్టమవుతుందని* హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో.
ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ కుమార్ గారు, మాజీ జడ్పిటిసి గార తౌడు గారు,మండల పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకటరమణ

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి