అడిగే వారే లేరా

the9newstelugu src=”https://9newstelugu.com/wp-content/uploads/2024/03/img_20240331_202255971324553101329157757.jpeg” class=”wp-image-496 alignnone size-full” width=”848″ height=”480″>

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు గిరిజన భూములకు రక్షణ కల్పించాలని గిరిజన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని ఒడిస్సా ప్రభుత్వం గిరిజనులపై చేస్తున దాడులను ఆపాలని కోటియా సరిహద్దు సమస్యపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం కై చొరవ చూపాలని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన కార్యక్రమం చేశారు. అక్కడ పనులు చేస్తున యంత్రాలను అడ్డుకొని పంపించి వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు వంతల సుందర రావు మండల కమిటీ సభ్యులు తాడంగి సన్నం మాట్లాడుతూ ఒడిస్సా ప్రభుత్వం అక్రమంగా అనుమతిలిస్తూ ఈ ప్రాంతంలో గిరిజనులు సాగులో ఉన్న భూములను లాక్కోవాలని ప్రయత్నం చేస్తుందని తెలిపారు ధూళి భద్ర దిగు సింబి ఎగో సెంబి గంజాయి భద్ర తదితర గ్రామాలన్నీ షెడ్యూల్ గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రకటించిందని షెడ్యూల్ గ్రామాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయాలని గిరిజనులు గ్రామ సభలు అనుమతులు ఉండాలని తెలిపారు ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా గిరిజనుల అనుమతులు లేకుండా మైనింగ్ లీజులు మంజూరు చేస్తూ అభివృద్ధి పేరిట గిరిజనులను భూములు నుండి దూరం చేయాలని ప్రయత్నం చేస్తుందని తెలిపారు ఏ అభివృద్ధి కార్యక్రమం ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్న ఎటువంటి అనుమతులు మంజూరు చేయాలన్న గిరిజనులు గ్రామసభ ఆమోదం తప్పనిసరి అయినా ఒడిస్సా ప్రభుత్వం గిరిజనుల పైన దౌర్జన్యం చేస్తూ భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేయడం సరికాదని అలా చేస్తే గిరిజనులంతా ఐక్యంగా పోరాడి తిప్పికొడతామని తెలిపారు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనులకు గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఒడిస్సా ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాటించకుండా ఇష్టానుసారం గిరిజనుల పైన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పైన దాడులు చేస్తున్న పట్టించుకోకపోవడం సరికాదని తెలిపారు అక్రమ అనుమతులు ఇవ్వడం వలన గిరిజన గ్రామాలు భూములు మాయం అవుతావని ఆందోళన తెలిపారు వీరి పోరాటానికి సిపిఎం పార్టీ మండల కమిటీ సంపూర్ణం మద్దతు తెలియజేస్తుందని మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు తెలిపారు ఈ ప్రాంతమంతా పిసా చట్టం అమలవుతుందని పేసా చట్టాన్ని తుంగలో తొక్కి అక్రమ అనుమతులు ఇవ్వడం సరికాదని తెలిపారు చట్ట ప్రకారం ఈ ప్రాంతంలో గిరిజనులవి సర్వ హక్కులని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం నాయకులు దిగు సెంబి, ఎగువ సెంబి ,గంజాయి భద్ర గ్రామాల, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *