సాలూరు
పట్టణంలో గల బోను వీధిలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయ కుమారి, భర్త మాధవరావు మరియు వార్డ్ లో గల టిడిపి కార్యకర్తలు పిడిక రాజన్న దొర సమక్షంలో వైసిపి కండువాలు వేసుకున్నారు. అనంతరం రాజన్న దొర మాట్లాడుతూ ఆత్మసాక్షి సర్వే మరియు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సర్వే ఇచ్చిన నివేదికల ప్రకారం ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని చెప్పారు టిడిపి వాళ్ళు కండువాలు వేసినంతమాత్రాన వాళ్లు గెలిచేది లేదని సాలూరు నియోజకవర్గం లో ఇందుకు సాక్ష్యంగా 2014 2019 ఎన్నికలే నిదర్శనమని ప్రజలందరూ ఈసారి కూడా వైసీపీకి ఓట్లు వేస్తారని మరోసారి నన్ను గెలిపిస్తరని తెలిపారు