ఆరేళ్లుగా నాతో నడుస్తున్న ఆర్టీఐ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు

— జై ఆంధ్ర (జై భారత్) అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్

విజయనగరం, అక్టోబర్ 24: నా రాష్ట్రం కోసం.. నా దేశం కోసం.. అనే ఆశయంతో జై ఆంధ్ర (జై భారత్) అసోసియేషన్ ప్రజల మధ్య, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తోందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్ పేర్కొన్నారు. గత ఆరు సంవత్సరాలుగా తనతో కలిసి ప్రజాసేవలో ముందుకు సాగుతున్న ఆర్టీఐ కుటుంబ సభ్యులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. వెంకటనారాయణ మాట్లాడుతూ, డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్ గత ఆరు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

సమాచార హక్కు చట్టం–2005పై రెండు తెలుగు రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నారని వివరించారు.

జై ఆంధ్ర అసోసియేషన్‌లో 50 శాతానికి పైగా మహిళలు సభ్యులుగా ఉండటం సంస్థలో మహిళల భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లాల వారీగా కమిటీ సభ్యులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు.

ప్రజాసేవను ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఆరు సంవత్సరాలుగా సంస్థ అభివృద్ధికి, ప్రజల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంపొందించడానికి కృషి చేస్తున్న వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్‌కు, ఆయనతో కలిసి పనిచేస్తున్న ప్రతి ఆర్టీఐ కుటుంబ సభ్యునికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి