మన్యం జిల్లాలో ఆర్‌టీఐ చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తాం

జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం నూతన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. లక్ష్మి

విజయనగరం, అక్టోబర్ 24: మన్యం జిల్లాలో సమాచార హక్కు చట్టం–2005పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం నూతన జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఎస్. లక్ష్మి తెలిపారు.

పెదకాడలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ టీ. నాగేంద్రబాబు ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. వెంకటనారాయణ సమక్షంలో ఫౌండర్ డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్, నూతనంగా నియమితులైన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. లక్ష్మి, జిల్లా ప్రచార కార్యదర్శి ఎస్. సోమేశ్వరరావులకు నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్. లక్ష్మి మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరుపై ప్రజలు సమాచారాన్ని పొందవచ్చని, ఈ చట్టంపై గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మన్యం జిల్లాలో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రజలకు ఆర్‌టీఐ చట్టంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు శంకర్రావు, ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి వెంకయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బిరుసు అప్పన్న తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పాడ రామకృష్ణ నూతనంగా నియమితులైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడంతో పాటు, ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతకు ప్రాధాన్యత కల్పించే దిశగా సంఘం పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి