ఎడతెరిపిలేని వర్షంలోనూ ఆగని స్థానిక ఎన్నికల్లో రాజన్నదొర ప్రచారం!
సాలూరు 10, 11వ వార్డుల్లో వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం
సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఎడతెరిపిలేని వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ నాయకులు రాజన్నదొర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 10, 11వ వార్డుల్లో వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి, కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలిశారు.
వర్షం కురుస్తున్నప్పటికీ ప్రచారాన్ని కొనసాగించిన రాజన్నదొరకు పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా తోడయ్యారు. పలు ప్రాంతాల్లో మహిళలు హారతులు పట్టి ఆయనకు స్వాగతం పలికారు. వైసీపీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని ఓటర్లను కోరుతూ నాయకులు ప్రచారం సాగించారు.
ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి, మక్కువ మండల మాజీ జడ్పీటీసీ మావుడి శ్రీనివాస నాయుడు తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడతెరిపిలేని వర్షంలోనూ ప్రచారం కొనసాగించడంతో సాలూరు పట్టణంలో ఎన్నికల సందడి మరింత పెరిగింది.








