టిడిపి ప్రచారం

టీడీపీ, జనసేన, ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి  గుమ్మడి సంధ్యారాణి ఈ రోజు మక్కువ మండలం సన్యాసరాజపురం (మరిపివలస) పంచాయితీ పెద్దబంటు మక్కువ, పుల్లేరువలస మరియు చెముడు పంచాయితీలో పాలికవలస, బురదగడ్డవలస, లింగడవలస గిరిజన గ్రామాల్లో జరిగే “బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ” కార్యక్రమం చేశారు.
ఈ కార్యక్రమంలో చెముడు గ్రామం నుంచి 50 కుటుంబాలు  పార్టీలో చేరారు.వారికి సంధ్యారాణి  కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువత వచ్చి పూలవర్షం కురిపించి , హారతులతో ఘనస్వాగతం పలికారు. యువత మాట్లాడుతూ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మమ్మల్ని పట్టించుకోవటం లేదని, రోడ్లు, మంచినీటి సౌకర్యం , ఉపాధి, కల్పిస్తామని, చెప్పి నేటికీ కార్యరూపం దాల్చకుండ మోసం చేస్తున్నారని తెలిపారు.
కొంతమంది మహిళలు, వృద్దులు వచ్చి ఈ వేసవి కాలంలో నీటికొరత చాలా ఎక్కువగా ఉంటుందని, చాలా ఇబ్బంది పడుతున్నామని, మాకు అమ్మవడి రాలేదని, గొర్రెల లోన్లు, పింఛన్లు లేవని,గర్భిణీ స్త్రీలకు YTC ద్వారా మెరుగైన వైద్యం , పౌస్తిక ఆహారం అందించి తల్లి,బిడ్డలను క్షేమంగా ఇంటికి పంపించేవారని టీడీపీ ప్రభుత్వంలో చాలా పథకాలు గిరిగోరు ముద్దలు, సంక్రాంతి కానుకలు, వ్యవసాయ పనిముట్లు, సబ్సిడీతో వాహనాలు, వడ్డీలేని రుణాలు మొదలగునవి ఇచ్చేవారని ఇప్పుడు అలాంటివి ఏమీ రావటం లేదని వారు తెలిపారు.

గుమ్మిడి సంధ్యారాణి గారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో టీడీపీ గెలిచిన వెంటనే నిత్యావసరాల వస్తువులు అందరికీ అందుబాటు ధరలలో వుంటాయని, లబ్ధిదారులు అందరికీ ఆన్ని పథకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలకు చంద్ర బాబు నాయుడు గారు అందించబోయే సూపర్ సిక్స్ పతకాలను ప్రజలకు వివరిస్తూ,ఈ ఐదేళ్ళ జగన్ రెడ్డి ప్రభుత్వం పాలనలో జరిగిన అరాచకాలను,ఆకృత్యాలకు సవివిరంగా వివరించడం జరిగినది.గత తెలుగు దేశం పార్టీ అధికారం లో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అందించిన దాదాపు 86 పధకాలను ఈ జగన్ రెడ్డి రద్దు చేసి ప్రజలను అన్యాయం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు .తెలుగు దేశం పార్టీ అందించిన రైతులకు పూర్తి స్థాయి సబ్సిడీ పై అందించి వ్యవసాయ పరికరాలు కానివ్వండి,చనిపోయిన కుటుంబాలకు చంద్ర బాబు నాయుడు గారి ప్రభుత్వం అందించిన చంద్రన్న భరోసా 2,00,000 రూపాయలు,మరియు 5,00,000 రూపాయలు ఈ ప్రభుత్వ హయాంలో తొలగించి రాష్ట్ర ప్రజలను అన్యాయం చేసిన ముఖ్య మంత్రి ఈ జగన్ రెడ్డి అని ఈ సందర్భంగా ఆమె విమర్శించారు.

.రాబోవు శాసన సభ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరుపున ఎమ్మల్యే అభ్యర్ధిగా నన్ను చంద్ర బాబు నాయుడు గారు మీముందుకు పంపించడం జరిగింది.మీ మక్కువ మండల ఆడపడుచుగా నన్ను ఆశీర్వ దించమని మిమ్మల్ని ప్రాదేయపడుచున్నాను.ఒక్క అవకాశం ఇచ్చి, పార్టీల అతీతంగా సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి,నాకు అత్యధిక మెజారిటీ అందించవలసినదిగా గ్రామం ప్రజలను కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుల్ల వేణుగోపాల్ నాయుడు, బొంగు వాసుదేవరావు, గొంగాడ భుసన్,చింతల తవిటినాయుడు, ఆయా గ్రామాల నాయకులు కందుల గంగరాజు, అల్లు లచ్చయ్య, పల్లేరు శ్రీను, జనసేన నాయకులు రమేష్, బుడిసెట్టి గౌరీ, మింది సింహాచలం, పట్నాన మల్లేశ్వరరావు, అక్యాన తిరుపతి, గౌరీ నాయుడు, పెంట సత్యం తదితరులు పాల్గొన్నారు..u

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *