మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారిని కలిసిన పోస్టల్ అధికారులు…

విజయనగరం ,అక్టోబర్ 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SERP శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారిని పోస్టల్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.గురువారం సాయంత్రం మంత్రి గారి ఇంటి దగ్గర పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర గారి ఆధ్వర్యంలో కలిశారు.ఈ సందర్భంగా IPPB REGIONAL HEAD శ్రీ రాజేంద్ర ప్రసాద్ పేరక గారు, IPPB సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సతీష్ గారు,బ్రాంచ్ మేనేజర్ భాందవి గారితో కలిసి మంత్రి గారికి వినతిపత్రం అందజేశారు…

అక్టోబర్ నెల నుంచి సామాజిక భద్రత పెన్షన్ లు కొంత మొత్తం డబ్బులు రూపంలో,మిగిలిన డబ్బులు లబ్ధిదారుని డిబిటి అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది.అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్ట్ కింద గజపతినగరం మండలం ఎంపికైంది..
డిబిటి అకౌంట్ లు అన్ని మన IPPB అకౌంట్ లు ఓపెన్ చేసే విధంగా అధికారులకు ఆదేశాల జారీ చేయాలని మంత్రి గారికి అభ్యర్థించడం జరిగింది.మంత్రి గారు సానుకూలంగా స్పందించి ,వెంటనే సంబంధిత అధికారులు తో ఫోన్లో మాట్లాడి తగు సూచనలు చేయడం జరిగింది..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి