జిల్లెళ్ళమూడి కాలేజ్ విశ్రాంత ప్రధానాచార్యులు కర్మయోగి,శిష్య వాత్సల్య జలధి అయిన శ్రీ విఠాల రామ చంద్రమూర్తిగారి సంతాప సభ సాలూరు లో రామాఫౌండేషన్ అమ్మ బడి వ్యవస్థాపక కార్య దర్శి శివలెంక ప్రసాదరావు మాష్టారు ఆధ్వర్యం లో ఘనంగా జరిగింది.
ఆయన ఈ లోకాన్ని వదిలినప్పటికీ గొప్ప భావనగా శిష్యులు మనస్సులో ఉంటారని ,ఆయన సేవా నిరతి,ధార్మిక జీవితం తమకెప్పుడూ ఆదర్శంగా ఉంటాయని ప్రసాదరావు మాష్టారు పేర్కొన్నారు.రామచంద్ర మూర్తి గారి సపిండీ కరణ సందర్భంగా ఈ రోజు 200 మంది నిరుపేదలకు యాచకులకు ఆహార పదార్థాలను ఆయన ,ఆయన శిష్య బృందం పంపిణీ చేశారు.ఆయన ఆశయాలను సిద్ధాంతాలను ఇక ముందు కూడా కొన సాగిస్తామని తెలియజేశారు.జిల్లెళ్ళమూడి అమ్మ,తన గురువు గారు తనకు రెండు నేత్రాలుగా వివరించారు