చీపురుపల్లి: రావివలసలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు ముమ్మరం: అధికారులతో కలిసి పరిశీలించిన రామ మల్లిక్ నాయుడు

ఈ నెల 28వ తేదీన విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రావివలస గ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. గౌరవ స్థానిక ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత కిమిడి మల్లిక్ నాయుడు గారు మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, డీఎస్పీ, ఆర్డీఓ మరియు ఇతర శాఖల అధికారులతో కలిసి సభా ప్రాంగణం, హెలిప్యాడ్ నిర్మాణ పనులను ఆయన నిశితంగా పరిశీలించారు.

ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారి సూచనల ప్రకారం ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే ప్రజలకు, కార్యకర్తలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రోటోకాల్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మరియు నాయకులకు మల్లిక్ గారు దిశానిర్దేశం చేశారు.

ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి