జిల్లా పోలీసుశాఖలో సుదీర్ఘంగా సేవలందించి, ఉద్యోగ విరమణ చేసిన ఒక ఎస్సై, ఒక ఎఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళు, ఒక కానిస్టేబులు మరియు ఒక హోంగార్డులకు ఘనంగా ‘ఆత్మీయ వీడ్కోలు’ పలికిన జిల్లా ఎస్పీ ఉద్యోగ విరమణ తరువాత ఎంచుకున్న మార్గాల్లో విజయం సాధించాలని, కుటుంబం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా, ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన (1) విజయనగరం, సిసిఎస్ ఎస్ఐ శ్రీ అజీజ్ ఉర్ రహ్మాన్ (2) రాజాం ఎఎస్ఐ ముద్దాడ రాజారావు (3) విజయనగరం 2వ పట్టణ హెచ్.సి. సిద్ధాంతం శ్రీనివాసరావు (4) విజయనగరం రూరల్ హెచ్.సి. పొట్నూరు రమణ (5) విజయనగరం ట్రాఫిక్ కానిస్టేబులు పట్నాల అప్పలకృష్ణ (6) హోంగార్డు గొర్లి కృష్ణ లను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఆగస్టు 3న ఘనంగా సత్కరించి” అత్మీయ వీడ్కోలు” పలికారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు విధులను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించి, పోలీసుశాఖకు క్రమశిక్షణతో సుదీర్ఘంగా సేవలందించడం అభినందనీయమన్నారు. జిల్లా పోలీసుశాఖకు ఎస్ఐ అజీజ్ ఉర్ రహ్మాన్, ఎఎస్ఐ ముద్దాడ రాజారావు, హెచ్ సి సిద్ధాంతం శ్రీనివాసరావు, హెచ్ సి పొట్నూరు రమణ, పట్నాల అప్పలకృష్ణ, హోంగార్డు గొర్లి కృష్ణలు జిల్లా పోలీసుశాఖకు అందించిన సేవలను జిల్లా ఎస్పీ కొనియాడారు. ఉద్యోగ విరమణ తరువాత సమయాన్ని కుటుంబ సభ్యులతోను, తాము ఎంచుకున్న రంగంలో మరింత ప్రగతిని సాధించేందుకు వినియోగించుకోవాలన్నారు. అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన అధికారులు, వారి కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ అప్యాయంగా మాట్లాడి, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన అధికారులను జిల్లా పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, సాలువలతోను, పూల మాలలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను ప్రధానం చేసి, ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు” పలికారు. పోలీసు ఉద్యోగుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరుపున చెక్‌లను, జ్ఞాపికలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అందజేసారు. ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టరు ఆర్.రమేష్ కుమార్, డి.టి.ఆర్.బి. ఎస్ఐ ప్రభావతి, కో-ఆపరేటివ్ కార్యదర్శి నీలకంఠం నాయుడు, పోలీసు అసోసియేషను అధ్యక్షులు కే.శ్రీనివాసరావు, పోలీసు కుటుంబ సభ్యులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, ఉద్యోగ విరమణ చేసిన పోలీసు ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. Spread the love టపా నావిగేషన్ డీఎస్సీ–2025 అవకతవకలపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం