కార్మిక సమస్యల పట్ల సిపిఐ,ఎఐటియుసి స్పందన మరువలేనిది……….. కార్మిక సమస్యల పట్ల సిపిఐ ఏఐటియుసి స్పందన మరువలేనిదని పలువురు కార్మికులు కొనియాడారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో 29వ వార్డు యాతవీధిలో సిద్ధి వినాయకుడికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బలగ.రాదానాయుడు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాతవీధి పెద్దలు,మహిళలు మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గ పరిధిలో కార్మికులు,మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో బలగ రాధా నాయుడు కృషి ఎంతో అభినందనీయమని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా అందరి మన్ననలు పొందుతున్న బలగ.రాధా నాయుడు ను సిపిఐ నియోజకవర్గ కార్యదర్శిగా,ఏఐటియుసి జిల్లా కార్యదర్శిగా నియమించిన పార్టీకి యూనియన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆమెకు ఈ పదవిని కట్ట పెట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రతిరోజు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్న రాధా నాయుడు రానున్న మున్సిపల్ ఎన్నికలలో సీపీఐ పార్టీ తరపున చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆమెను గెలిపించేందుకు మేమంతా ముందు ఉంటామన్నారు. అనంతరం కార్మికుల పట్ల ఆమె చేస్తున్న కృషిని గుర్తిస్తూ దుస్సాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో పెద్దలు పాపారావు మోహన్ రావు అప్పన్న గణేశు పలువురు మహిళలు యువత పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి