ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో నగరంలో జూన్ 4వ తేదీ వరకు 144 సీఆర్పీసీ సెక్షన్లు అమలులో ఉన్నందున నగరంలో ఏ విధమైన ర్యాలీలు, ఊరేగింపులు గుంపుగా జరుపుకునే ఇతర కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వబడవు. కావున ప్రజలందరూ ఎన్నికలు జరిగిపోయినట్లు గా భావించి సోషల్ మీడియాలో గాని బయట గాని వాట్సాప్ గ్రూపులో గాని రెచ్చగొట్టే విధంగా ఎటువంటి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకూడదు. ప్రజలందరూ సంయమనం పాటించవలెను. అనుమానిత వ్యక్తులు గాని, నేరం జరగడానికి సంబంధించిన సమాచారం గానీ తెలిసిన వెంటనే పోలీసు వారికి తెలియజేయగలరు.
కాబట్టి నగరంలో ఈ విషయమై పలు ప్రదేశాల్లో సాలూరు పట్టణ పోలీసు వారు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు