16వ రోజు షెడ్యూల్ ఏరియా సాధన న్యాయ పోరాట దీక్షలో భాగంగా ఈరోజు జగ్గు దొర వలస గ్రామంలో పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనులు చేపడుతున్న నిరాహార దీక్ష కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ *జయరాం పాంగి* (Ex ఎంపీ, Ex మినిస్టర్, DPBP చైర్మన్ – ఇండియా) గారు జగ్గు దొర వలస విచ్చేసి ఉన్నారు. ఆయన కార్యక్రమంలో భాగంగా గా మాట్లాడుతూ, చట్ట ప్రకారం కోటి ఇచ్చిన తీర్పుని ఇచ్చిన గడువులోపు అమలు చేయాలి అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ కింద లెక్కకడుతూ సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు అని, ఈ సమస్యను భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది మురముగారి దగ్గరికి, అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి కూడా తీసుకు వెళ్తానని చెప్పి అన్నారు. అలాగె మనమంతా కలిసి ఢిల్లీ వెళ్లి మన సమస్యని వారికి తెలియజేద్దామని అన్నారు. ఒకప్పుడు మనమంతా ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో భాగంగా ట్రైబల్ బెల్ట్ అంతా ఒక ప్రాంతంగా వైజాగ్ పట్టణం లో ఉండే వాళ్ళం. రాను రాను రాష్ట్రం బై ఫర్ కేషన్ తర్వాత విడిపోయాం, అయినా కూడా మనమంతా ఒకే తల్లి బిడ్డలం. కాబట్టి మీ సమస్య కూడా మా సమస్య. షెడ్యూల్ ఏరియా సమస్యను ఏ ప్రభుత్వాలు పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు కాబట్టి, మనమంతా కూడా ఒరిస్సా నుండి నాలుగు జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ నుండి రెండు జిల్లాలు కలిపి ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని ఒక స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మీ ఆంధ్ర రాష్ట్రంలో, పార్వతీపురం మన్యం జిల్లాలో గల 14 మండలాలకు ఐదవ షెడ్యూల్ సమస్య ఉంది కాబట్టి, స్వయం ప్రతిపత్తి గల ఒక గిరిజన రాష్ట్రంగా ఏర్పడితే మనకి రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ లో పొందుపరిచిన హక్కులన్నీ మనకి కల్పించబడతాయి. కాబట్టి గిరిజనులంతా ఏకమై ఒక తాటికి రావలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి జయరామ్ పాంగీ గారు మాట్లాడారు. ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ పార్వతీపురం మన్యం జిల్లా చైర్మన్ అయినటువంటి నిమ్మక జయరాజు గారు మాట్లాడుతూ. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 1496 గ్రామాల లిస్టు ని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెబ్సైట్లో పొందుపరచడానికి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి గడువు తీరడానికి ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉందని, ఏప్రిల్ ఒకటవ తేదీ లోపు షెడ్యూల్డ్ ఏరియా లిస్టు ని పొందుపరచాల్సిన అవసరం ఉందని. ఒకవేళ అలా జరగని పక్షంలో గిరిజనుల నుండి తిరుగుబాటు తప్పదని, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడి చేస్తామని తెలియజేశారు. న్యాయ పోరాటంతో పాటు ధర్నా చేయడానికి కూడా వెనకాడబోమని అన్నారు. కార్యక్రమంలో గిరిజన ఉపాధ్యాయ నాయకులు రాయల సుందర్ రావు గారు, ఆదివాసి ఐక్య వేదిక అధ్యక్షులు గేదెల రామకృష్ణ గారు, APSAAS అధ్యక్షులు నిమ్మక సింహాచలం గారు, AJAC మన్యం జిల్లా వైస్ చైర్మన్ కొండ గొర్రె ఉదయ్ కుమార్ గారు, ITDS అధ్యక్షులు టీవీఎస్ రాము, మండల గిరిధర్ రావు, మువ్వల పుష్పారావు, నిమ్మక అన్నా రావులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ ఏప్రిల్ 10వ తేదీ లోపు పూర్ణపాడు-లాభేసు వంతెన.. పెండింగ్ పనులు ప్రారంభించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం తీవ్రత చేస్తాం