గుర్ల మండలం జమ్ము పేట లోనీ వైసీపీ పార్టీ నుంచి వార్డ్ మెంబర్ తో సహా 25 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక

గుర్ల మండలం జమ్ము పేట లోనీ వైసీపీ పార్టీ నుంచి వార్డ్ మెంబర్ తో సహా 25 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక

విజయనగరం జిల్లా..

*గుర్ల మండలం జమ్ము పేట లోనీ వైసీపీ పార్టీ నుంచి వార్డ్ మెంబర్ తో సహా 25 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక..*

చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం జమ్ము పేట గ్రామానికి చెందిన సుమారు 25 వైసీపీ కుటుంబాలు వార్డ్ మెంబర్ తో సహా ఈ రోజున చీపురుపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు, మరియు గుర్ల మండల పార్టీ అధ్యక్షులు యడ్ల సంతోష్ గారి సమక్షంలో రెడ్డి పైడినాయుడు  ఆధ్వర్యంలో  వైసిపి వార్డు మెంబర్ కె రామనాయుడు తో సహా కె పైడినాయుడు, కె త్రినాథ్  కె వంశీ, పి గోవింద్, వి సురేష్, వై రాజు, సీహెచ్ పాపారావు, సిహెచ్ హరీష్, కె జగదీష్, పి శంకర్, కె అప్పలనాయుడు, పి ఆది, ఎం సురేష్ , కె నరసింహమూర్తి,  సిహెచ్ దాలయ్యా, సిహెచ్ లక్ష్మీనారాయణ ,కె జాను,టి రాజారావు, కె నాయుడు, కె రమణ వై త్రినాధరావు తదితరులను జనసేన పార్టీ కండువా  కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.

అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ 2026 నూతన సంవత్సర సందర్భంగా ఈరోజు నూతనంగా జనసేన పార్టీలో  జాయినింగ్ కావడం మంచి శుభ పరిణామం గా భావిస్తూ …అలాగే ప్రతి గ్రామం నుండి  వైసిపి కార్యకర్తలు జనసేన పార్టీ సిద్ధాంతాలను అధినేత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పనితీరును చూసి పార్టీలో జాయిన్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదే స్పూర్తి తో రాబోయే రోజుల్లో చీపురుపల్లి నియోజకవర్గం లో భారీ సంఖ్యలో జనసేన పార్టీలో కి చేరికలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులకు జనసైనికులకు వీర మహిళలకు నియోజకవర్గ ప్రజానీకానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు రమేష్ రాజుగారు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి