ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు



ఈరోజుతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా,
స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సాలూరు మున్సిపాలిటీ 21వ వార్డులో కేక్ కటింగ్ చేసి, సీఎం గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, నేటి వరకు నాలుగుసార్లు సీఎం పదవిలో కొనసాగుతూ 14 ఏళ్లు 11 నెలలు (5,442 రోజులు) ప్రజాసేవలో అపారమైన కృషి చేసిన నాయకుడిగా నిలిచారని మంత్రి అన్నారు.

హైదరాబాద్ రూపురేఖలు మార్చిన హైటెక్ సిటీ, సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులు ఆయన దూరదృష్టికి నిదర్శనమని గుర్తుచేశారు. నాడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, నేడు అమరావతిలో క్వాంటం వ్యాలీ రూపకల్పన చేసిన నాయకుడు చంద్రబాబు గారేనని అన్నారు.

అలాగే 2024లో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ అమరావతి, పోలవరం, విశాఖ, రాయలసీమ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రివర్యులు తెలిపారు.

“మీ పరిపాలన దక్షత, క్రమశిక్షణ, నిబద్ధత, కృషి, అంకితభావం, పట్టుదల అన్ని తరాలకు ఆదర్శం. మీ నాయకత్వంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేయడం నాకు గర్వకారణం. మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను సార్” అని మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి  అన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి