మజ్జి కృష్ణవేణి గారికి ఘనంగా నివాళులర్పించిన* ఆధ్యాత్మికవేత్తలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు

విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తల్లి దివంగత శ్రీమతి మజ్జి కృష్ణవేణి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శ్రావణ చైతన్యానంద స్వామి , మాజీ ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ , మాజీ ఎమ్మెల్యే శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు , శ్రీ అలజంగి జోగారావు తో పాటు పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు విచ్చేసి దివంగత కృష్ణవేణి గారికి శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం చిన్న శ్రీను గారి ని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి