సాలూరు, జూలై 18 : జిల్లాలో ప్రతి గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదామని, ఇందులో గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ తెలిపారు. శనివారం సాలూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి గ్రామం, వార్డు బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదామనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్ల లోపు బాలికలకు, 21 ఏళ్ల లోపు బాలురకు వివాహాలు జరపడం చట్టరీత్యా నేరమని తెలిపారు. బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటుందని వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు సమన్వయంతో పనిచేసి బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని కోరారు. ప్రతి గ్రామంలో అనుమానాస్పద బాల్య వివాహాలపై అప్రమత్తంగా ఉండి వెంటనే సంబంధిత మహిళా పోలీస్, పంచాయతీ కార్యదర్శి అధికారులకు లేదా 1098 సమాచారం అందించాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. బాల్య వివాహాలను అరికట్టి ప్రతి బాలుడు, బాలికకు విద్య, ఆరోగ్యం, రక్షణ, సురక్షితమైన భవిష్యత్తు కల్పించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీడీపీఓ కె.మంగమ్మ, అంగన్వాడీ సూపర్వైజర్లు, జిల్లా బాలల సంరక్షణ విభాగం సోషల్ వర్కర్ పైడపు నాయుడు, కౌన్సిలర్ తవిటి నాయుడు, కేస్ వర్కర్లు భారతి, కళ్యాణి, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి