ప ార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపీఎస్ గారి ఉత్తర్వులు మేరకు పెట్రోలింగ్‌లో భాగంగా సాలూరు శక్తి టీం సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సాలూరు టౌన్ చిన్న వీధికి చెందిన దేవి అనే అమ్మాయి సాలూరు మున్సిపల్ ఆఫీస్ రోడ్లో స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి ఆటో డ్రైవర్ ఆటో తో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ వచ్చి గుద్దేసి వెళ్లిపోతుండగా సాలూరు శక్తి టీం మరియు టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆటోను,చోదకుడును పట్టుకొని స్టేషన్‌కు అప్పగించి శక్తి టీం వాహనంలో తలకు గాయం తగిలిన దేవి అనే అమ్మాయిని తక్షణమే సాలూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లి మెరుగైన వైద్య సహాయం అందే విధంగా చేసినారు. పోలీసు వారు తక్షణమే క్షతగాత్రులను తరలించడం వలన వారు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాలూరు శక్తి టీం HC సీతయ్య మరియు సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ HC వెంకటరావు విధి నిర్వహణలో భాగంగా పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ పాచిపెంటలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ