ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా సంక్షేమ, సుపరిపాలన స్ఫూర్తితో నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు ముంజేరు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు రెవెన్యూ, ఇళ్ల స్థలాల కేటాయింపు, విద్యుత్ లో-వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ స్తంభాల మార్పు, సీసీ రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి సమస్యలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన పలు అర్జీలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్జీని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గారు శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి సమస్యలను కాలపరిమితిలో, ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గారు మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పాలన అందుతోంది. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం నా బాధ్యత. ప్రతి అర్జీని చివరి దశ వరకు పర్యవేక్షించి, అర్హులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తాను” అని తెలిపారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ, అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసి పరిష్కార దిశగా చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గారి తీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల గడప వద్దకే పాలనను తీసుకెళ్లాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పానికి ‘ప్రజా దర్బార్’ మరో నిదర్శనంగా నిలిచింది. Spread the love టపా నావిగేషన్ మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారి ఆధ్వర్యంలో AP GEN-Z WAR ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభలో ఘన నివాళులు