సాలూరు మండల కేంద్రం లో బంద్ శాంతియుతంగా విజయవంతంగా జరిగింది ఈ సందర్బంలో sfi జిల్లా కార్యదర్శి D. పండు మాట్లాడుతూ
నీట్, యూజీసీనెట్ పరీక్ష పేపర్ లీక్ ను నిరసిస్తూ 2024 జులై 4వ తేదీన దేశవ్యాప్తంగా kg నుండి pg వరకు విద్యాసంస్థల బందుకు ఎస్ఎఫ్ఐ అఖిల భారత కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది బంద్ విజయవంతం అనంతరం .వన్ నేషన్ – వన్ ఎక్సమ్ ముసుగులో మొత్తం పరీక్ష వ్యవస్థ కుప్ప కూలింది. విద్యార్థుల విద్యా భవిష్యత్తులో,ప్రమాదంలోఉన్నది.నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఏ)జాతీయస్థాయి పరీక్షలను నిర్వహించడంలో విఫలమైంది. తీవ్రమైన అవకతకు, వ్యత్యాశాలతో జరిగిన నెట్ పీజీ పరీక్షకు బాధ్యత వహించి వాయిదా వేసింది. జూన్ 4న ప్రకటించిన నీట్ పరీక్షా ఫలితాలు పారదర్శకంగా లేవని పేపర్ లీక్ పై ఫిర్యాదులు వెల్లువెత్తారు.దీంతో లక్షల మంది విద్యార్థులు నష్టపోయారు.
ఇటువంటి కేంద్రీకృత పరీక్షలు విద్యను ప్రైవేటీకరించడాన్ని, కోచింగ్ సెంటర్ల సంస్కృతిని పెంపొందించి, ప్రోత్సహిస్తున్నది ఇది అత్యంత ప్రమాదకరం.ఉన్నత విద్య మాత్రమే కాకుండా పాఠశాల విద్యా పరిస్థితి కూడా దారుణంగా ఉంది.
బిజెపి పాలనలో విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో కోత, ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గడం జరిగింది. దేశంలో విద్య మరియు ప్రజాస్వామ్యం పై దాడికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జూలై 4న దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో, మండల కమిటీ సభ్యులు, వరుణ్, నితిన్ రాజు సింహాద్రి సమీర్ పాల్గొన్నారు.