బాలసారే వేడుకలో సందడి చేసిన ప్రముఖులు మెంటాడలో పతివాడ కుటుంబ ఆహ్వానం మేరకు పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర.. చిన్నారిని ఆశీర్వదించిన ప్రముఖులు మెంటాడ: మెంటాడ మాజీ ఎంపీటీసీ పతివాడ కుమారి కుటుంబంలో జరిగిన బాలసారే వేడుక ఘనంగా నిర్వహించారు. ఆమె తనయుడు పతివాడ విశ్వేశ్వరరావు కుమారుడి బాలసారే కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పతివాడ కుమారి ఆహ్వానం మేరకు కార్యక్రమానికి విచ్చేసిన రాజన్నదొర చిన్నారిని ఆప్యాయంగా ఆశీర్వదించి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించి వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి ప్రతిపక్ష నేత, విశాఖ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తనయుడు సందీప్, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తనయుడు గురుమూర్తి నాయుడు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు, స్థానిక ప్రముఖులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన బాలసారే వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆత్మీయ కలయికతో సందడిగా సాగింది. Spread the love టపా నావిగేషన్ టీడీపీ శ్రేణుల్లో జోష్