టీడీపీ శ్రేణుల్లో జోష్.. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన కీలక భేటీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నివాసంలో ఆత్మీయ సమావేశం.. అభివృద్ధి, సంక్షేమం, స్థానిక ఎన్నికల వ్యూహంపై నేతల చర్చ బొబ్బిలి, సెప్టెంబర్ 20: విజయనగరం పార్లమెంటు పరిధిలో టీడీపీ రాజకీయ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆదివారం ఆత్మీయంగా సమావేశమయ్యారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించే అంశాలపై నేతలు చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై సమావేశంలో అభిప్రాయాలు పంచుకున్నారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, ప్రజలతో మరింతగా మమేకం కావడం, స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం వంటి అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా పార్లమెంటు ఇన్చార్జి, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎచ్చెర్ల టీడీపీ ఇన్చార్జి లంక శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ హెటిరో ఉద్యోగ మేళాలో ప్రతిభకు పట్టం శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాల వేదికగా 11 మంది అభ్యర్థుల ఎంపిక