సతివాడలో రెపరెపలాడిన జనసేన జెండా.. శ్రేణుల్లో నూతనోత్సాహం తెర్లాం: మండలంలోని సతివాడ గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షులు రవి మారదాన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ఎందువ సత్యనారాయణ, యామిని, ఎందువ ముఖేష్ నాయుడు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా నాయకులు పాలూరు బాబు, ఉత్తరాంధ్ర వీర మహిళా విభాగం రీజినల్ కోఆర్డినేటర్ లక్ష్మీ రాజ్ ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాలూరు బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నాయకులు, జనసైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సతివాడలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ పార్టీ ప్రతినిధులను అభినందించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జనసేన నాయకుల దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి మోతిదాసు, మండల నాయకులు ఎస్.ఎస్. మహేష్ చండక, అబోతుల రాజేష్, బలగ ఆదినారాయణ, చింత శ్రీనివాస్, ఎడ్ల రాము, కిండేనా వినోద్, ఉమా, చిన్న, రెడ్డి లక్ష్మునాయుడు, బొబ్బిలి మండల అధ్యక్షులు గంగాధర్ సంచన, కల్యాణ్ బద్రి దిబ్బ, అలజంగి గణేష్, బలిజిపేట మండల అధ్యక్షులు బంకూరు పోలినాయుడు, మండల నాయకులు పాలూరు వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో జనసైనికులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Spread the love టపా నావిగేషన్ గురజాడ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి: ఎమ్మెల్యే బేబీనాయన బొబ్బిలిలో 35 కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసా