చీపురుపల్లి టౌన్, సెప్టెంబర్ 21/9/2026,సోమవారం

*చీపురుపల్లి పట్టణంలో లావేరు రోడ్డు, వంగపల్లెపేట, రిక్షాకాలని, రామాంజనేయ కాలనీ,విజయకాలని వీధుల్లో ఏర్పాటు చేసిన వినాయకమండపాలను సందర్శించి అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించిన జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,టౌన్ ప్రెసిడెంట్ గవిడి నాగరాజు,యువనాయకులు గద్దె అనురాగ్*
*వినాయక మండపాలను సందర్శించి అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు*

చీపురుపల్లి పట్టణం లో వివిధ ఏరియాల్లో ఏర్పాటుచేసిన వినాయక మండపాలను చీపురుపల్లి జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు శుక్రవారం సందర్శించారు. మండపాల కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు ఆయన వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మండపాల కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,గవిడి నాగరాజు,గద్దె అనురాగ్, గవిడి కల్కి జీవన్, కర్రోతు ప్రసాద్, ప్రభాత్, వివేక్, వేంపడాపు, లక్ష్మునాయుడు,ఇల్లాపు ఆది, మొండేటి శ్రీను మహేష్, కూర్మ కిరణ్,శ్రీను, మజ్జి శంకర్, ఇప్పిలి కృష్ణ, RKM, పప్పల శంకర్, కనకరాజు, రాజారావు, అప్పారావు, వెంకీ, , రాంకీ, రమణ, గంగరాజు, గణేష్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి