పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరై పౌష్టికాహారం, చిన్నారుల ఆరోగ్యం, మహిళల సంక్షేమంపై అవగాహన కల్పించారు.

కొత్తగా నియమితులైన 179 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహార సేవలు అందించడంలో అంగన్‌వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

అంగన్‌వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన వివిధ పౌష్టికాహార స్టాళ్లను మంత్రి సందర్శించి, ఆహార పదార్థాలను పరిశీలించారు. స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని పిల్లలకు అందించాలని సూచించారు.

చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆడపిల్లలు–మగపిల్లలకు సమాన పోషణ, విద్య, అవకాశాలు కల్పించాలని మంత్రి సూచించారు.

మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని తెలిపారు.

కార్యక్రమంలో ప్రభుత్వ విప్ జగదీశ్వరి, జిల్లా కలెక్టర్, పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ, పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర, ఐసీడీఎస్ పీడీ, అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి