*విశాఖపట్నం, సెప్టెంబర్ 25:* *గౌరవ మాజీ ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు,* వారి కుమార్తె *మజ్జి సిరి సహస్ర (సిరిమ్మ) గారితో* కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారిని విశాఖపట్నంలోని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా *హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారితో* చిన్న శ్రీను గారు, సిరి సహస్ర గారు ఆత్మీయంగా ముచ్చటించారు. పలు అంశాలపై స్నేహపూర్వకంగా చర్చించారు. ఈ భేటీ ఆత్మీయ, స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు గారు, మాజీ వెలమ కోఆపరేషన్ చైర్మన్ శ్రీ నెక్కల నాయుడు బాబు గారు, మాజీ జడ్పీటీసీ శ్రీ వర్రీ నరసింహమూర్తి గారు, సీనియర్ నాయకులు శ్రీ కూరాకుల సూర్యరావు గారు తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ కన్యాశుల్కం’తో సమాజాన్ని మేల్కొలిపిన మహాకవి గురజాడ అప్పారావు :విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్