సిపిఎం పార్టీ కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి కూటమి ప్రభుత్వానికి అధికారులకు చూటి ప్రశ్న

* *వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగనన్న కాలనీకి అన్ని వసతులు మెరుగైనవి కల్పిస్తామని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మేడం గారు వచ్చారు ప్రారంభించారు తర్వాత అక్కడ ఏమి జరిగిందో పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి*

*కనీసం సీసీ రోడ్డు లేదు కాల్వ లేదు ఎక్కడబడితే అక్కడ మెరకలు తుప్పలు డొంకలు రాత్రివేళ పాములు తిరిగే పరిస్థితి*

*వానొస్తే కాలనీ అంతా చెరువులు సముద్రం మాదిరిగా మారిన జగనన్న కాలనీ ప్రజల పరిస్థితి*

*మెరకల పైన లోతైన గుట్టల పైన ఇల్లు స్థలాలకు పట్టాలు ఇచ్చి కనీసం చదును చేయకున్నా గాలికి వదిలేసిన జగనన్న ప్రభుత్వం*

*ఇల్లు స్థలాలు ఇచ్చారని సంతోషం పడాల ఆ ఇల్లు కట్టుకోలేక అప్పుల పాలవుతామని భయంతో ఇల్లు స్థలాలను గాలికి వదిలేసి లబోదిబో మణి ఏడవాలా తెలియని పరిస్థితిలో లబ్ధిదారులు*

*ఎవరో కొంతమంది కానీ పరక ఉన్నవారు ఇల్లు కట్టుకున్నారు తప్ప మిగతావారు మేరకలు డొంకలు చూసి భయపడి పూర్తిగా కట్టని వారు ఎంతోమంది ఉన్నారు అలాగే పునాది వేసి మరి కట్టుకోలేక పూర్తిగా వదిలేసిన వాళ్ళు ఎంతోమంది పేదలు ఉన్న పరిస్థితి*

*జేజేయం పథకం ద్వారా నీరు ఇచ్చారు పైపులు తిన్నగా లేవు ఎప్పుడు నీరు వస్తాదో ఎప్పుడు రాదో తెలియని పరిస్థితి కరెంటు స్తంభాలు వేసి కరెంటు మాత్రం బాగా వేశారు*

*ఈ విధంగా జగనన్న కాలనీ నాలుగు సంవత్సరాలుగా దర్శనమిస్తుంటే కనీసం సచివాలయం సిబ్బంది గానీ స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుండి సిబ్బంది కానీ పరిచలించడంతోపాటు అక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి**

*ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న కాలనీ వైపు పూర్తిగా చూసే పరిస్థితి లేదని కాబట్టి వెంటనే కూటం ప్రభుత్వం ఇలా అసంపూర్తిగా అసౌకర్యాలు మధ్య ఎటువంటి భరోసా లేకుండా ఉన్న జగనన్న కోనల వైపు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి అన్ని విధాలుగా సీసీ రోడ్డు కాలువలు మంచినీటి సౌకర్యం భూమి చదును చేసి మౌలిక వసతులు కల్పించి జగనన్న కాలనీ ప్రజలకు భరోసా కల్పించాలని సిపిఎం పార్టీగా విన్నవించుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా అధికారులు వెంటనే యుద్ధ ప్రాతిపదికన జగనన్న కోనల వైపు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుచున్నాము ఈ విషయంపై త్వరలో ప్రారంభం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా అటు అధికారులకు ఇటు కూటమి ప్రభుత్వానికి తెలియజేయుచున్నాము ఈ కార్యక్రమంలో జగనన్న కాలనీ కట్టిన లబ్ధిదారులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి