కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక కర్షక రైతు వ్యతిరేక బడ్జెట్ ఈ బడ్జెట్లో కార్మిక వర్గం మీద మధ్యతరగతి మీద రైతుల మీద పెనుబారం వేయడం జరిగింది కార్పొరేట్లకు వేలాది కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వడం జరిగింది గ్రామీణ ఉపాధి హామీకి నిధులు తగ్గించడం ద్వారా ఉపాధి హామీ పనులు భవిష్యత్తులో ప్రశ్నార్ధకం అయ్యే పరిస్థితి అలాగే ఐసిడిఎస్ నిధులు పెంచకపోవడం వల్ల ఒకవైపు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా బడ్జెట్ పెంచకపోవడం వలన అంగన్వాడి సెంటర్ లో అందుతున్న పౌష్టికాహారం భవిష్యత్తులో కొనసాగింపు కష్టమే ఇప్పటికే కార్మిక వర్గం అధిక ధరలతో ఉద్యోగుల లేమితో కొట్టు మిట్టడే పరిస్థితి దీనికి పరిష్కారం ఈ బడ్జెట్ లో లేదు అలాగే ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీ తగ్గించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు ఖర్చులు పెరిగి వ్యవసాయం సంక్షోభం లోకి వెళ్లే పరిస్థితి దీనివలన ధరలు మరింత పెరిగి సామాన్యులు కు భారం పెరుగుతుంది అలాగే ఆంధ్ర రాష్ట్రానికి విభజన హామీలు ఏవి కూడా పట్టించుకోకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి గానీ కడప స్టీల్ ప్లాంట్ గురించి గానీ ఉత్తరాంధ్ర వెనుకబడిన నిధులు అనే ఇవ్వకుండా కేవలం అమరావతి నిర్మాణం కోసం 15 వేల కోట్ల రూపాయలు అప్పురూపంలో ఇవ్వడం దారుణం అసలే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మరింత అప్పుల్లోకి నెట్టడం తప్ప గ్రాంట్ రూపంలో ఒక పైసా ఇవ్వకపోవడం పైగా బీహార్ కు 56 వేల కోట్లు రూపాయలు గ్రాంట్ గా ఇవ్వడం శ్వాసనియము ఇప్పటికైనా అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీలు కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నాయి అందువలన పైగా వీరి బలం మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కావున గత పది సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం గురించి కేంద్ర కేంద్రంతో గట్టిగా పోట్లాడి మన రాష్ట్రానికి రావలసిన గతంలో కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన హామీలను రాబట్టాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి ఏ గౌరీ నాయుడు పెన్షనర్ సంఘం కార్యదర్శి ఓ ఎస్ ఎన్ మూర్తి పంచాయతీ వర్కర్స్ యూనియన్ అప్పన్న పాల్గొనడం జరిగింది