వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కూటమి నేతల ఎన్నికల ప్రచారం

సాలూరులో 1, 2, 6 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్ ప్రచారం

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు:

సాలూరు పట్టణంలో స్థానిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎడతెరిపిలేని వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కూటమి నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బుధవారం పట్టణంలోని 1వ వార్డు లో వరలక్ష్మి , 2వ వార్డు లో పప్పల మోహన్, 6 వార్డుల్లో ఆల్తి పద్మ, కూటమి తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేస్తున్నట్టు నాయకులు తెలిపారు .

ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు.

పట్టణంలోని 1, 2, 6 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఆయన, ఆయా వార్డుల్లో టీడీపీ అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న గొర్లె విజయకుమారికి (గాజు గ్లాసు)గుర్తుపై ఓటు వేసి మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాగిన ఈ ప్రచారంలో కూటమి నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాలూరు పట్టణంలో స్థానిక ఎన్నికల పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

నైన్ న్యూస్ తెలుగు
నిజం… మా లక్ష్యం.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి