అర్ణబ్ తుఫాను బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
పునరావాస కేంద్రంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి
సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా:
అర్ణబ్ తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి భరోసా ఇచ్చారు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని భాష్యం స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంత్రి సంధ్యారాణి సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న తుఫాను బాధిత కుటుంబాలను పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా బాధితులకు అవసరమైన భోజనం, దుప్పట్లు, దుస్తులు అందించడంతో పాటు, అవసరమైన వైద్య సహాయం కూడా తక్షణమే అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తుఫాను బాధితులకు సహాయక చర్యలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించి, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
తుఫాను బాధితులను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించడంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.



