మహిళలకు సమాచార హక్కు చట్టం – 2005 ఒక శక్తివంతమైన ఆయుధం
జై ఆంధ్ర (జై భారత్) జాతీయ సలహాదారుల సభ్యురాలు డాక్టర్ కే. ఇందిరా ప్రియదర్శిని
విశాఖపట్నం, నవంబర్ 12:
మహిళల హక్కుల పరిరక్షణకు, ప్రభుత్వ పాలనలో పారదర్శకతను సాధించడానికి సమాచార హక్కు చట్టం – 2005 ఒక శక్తివంతమైన ఆయుధమని జై ఆంధ్ర (జై భారత్) జాతీయ సలహాదారుల సభ్యురాలు (సాంస్కృతిక కార్యక్రమాల విభాగం) డాక్టర్ కే. ఇందిరా ప్రియదర్శిని అన్నారు.
జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్ ఆదేశాల మేరకు జాతీయ సలహాదారుల సభ్యురాలు డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, రాష్ట్ర సలహాదారుల సభ్యులుగా సీతారామరాజును నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు పి. వెంకటనారాయణ వెల్లడించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని సంఘ సభ్యులందరూ క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో అవగాహన కల్పించడంతో పాటు సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహిళలు తమ హక్కులను తెలుసుకుని, ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను కోరుతూ సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు శ్రీమతి లక్ష్మి డాక్టర్ ఇందిరా ప్రియదర్శినికి శుభాకాంక్షలు తెలియజేశారు.

