చీపురుపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున విసినిగిరి ధనలక్ష్మి పోటీ

చీపురుపల్లి: చీపురుపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున విసినిగిరి ధనలక్ష్మి పోటీ చేయనున్నట్లు పార్టీ నాయకులు ప్రకటించారు. జనసేన పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు, నియోజకవర్గ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.
ఈ సందర్భంగా ధనలక్ష్మిని అఖండ మెజారిటీతో గెలిపించాలని జనసేన నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలను కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జి. అగ్రహారంలోని గ్రామదేవత శ్రీ పురటాల పోలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి శ్రీరామ మందిరంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
“జనసేనకు మీ ఓటు – చీపురుపల్లి అభివృద్ధికి మా హామీ” అనే నినాదంతో పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి